కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దోచుకోవడం దాచుకోవడమే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాద‌వ్

by Ratna Kumari |

దిశ‌, క‌ల్వ‌కుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దోచుకోవడం, దాచుకోవడం అన్న రీతిగా మారిపోయిందనీ రాష్ట్రంలో ఎక్కడ చూసిన‌ అవినీతి రాజ్యమేలుతోందనీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్

కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దోచుకోవడం దాచుకోవడమే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాద‌వ్
X

దిశ‌, క‌ల్వ‌కుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దోచుకోవడం, దాచుకోవడం అన్న రీతిగా మారిపోయిందనీ రాష్ట్రంలో ఎక్కడ చూసిన‌ అవినీతి రాజ్యమేలుతోందనీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల స‌మావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 12 మోసపూరిత హామీలను ఎండగడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష ఇరవై వేల కుటుంబాలకు ప్లకార్డులను పంచుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి జరుగుతుంటే నోరు, కళ్ళు మూసుకుని చూస్తున్నారనీ.. కాంగ్రెస్డ్ పార్టీ అధిష్టానం ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆయన మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ కావాలంటే ఢిల్లీలో అఖిల పక్ష నాయకులను తీసుకుని రాష్ట్రపతి ఆమోదించడానికి ప్రయత్నించాలనీ, బీసీ లను మోసం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం లేని జీవో ఆమోదం కాదన్న విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థం కాకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ఆరు గ్యారెంటీలు, భోగసు పథకాల వల్ల భవిష్యత్ లో కాంగ్రెస్ కి పుట్టగతులు ఉండవని.. ఇక ఎప్పటికీ అధికారంలోకి రారని డిసైడ్ అయి విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు.

సీఎం రేవంత్ ఉమ్మడి పాలమూరు జిల్లాను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలనీ.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పేరుకు జైపాల్ రెడ్డి పేరు పెడతాననీ చెప్పి.. ఇప్పటి వరకు ప్రాజెక్టు కు ఒక్క రూపాయి కూడా కేటాయింపులు చేయలేదన్నారు. ప్రాజెక్టు నుండి తట్టెడు మన్ను కూడా ఎత్తిపోయలేదనీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా రూ.1000 కోట్లు మంజూరు చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించామని, రేవంత్ రెడ్డి కి దూరం చూపు లేదనీ , ప్రతిపక్షాల నాయకులను తిట్టడం మాత్రం తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తూ యూరియా కూడా ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమన్నారు. హైదరాబాద్ శ్రీశైలం రోడ్డును ఆరు లైన్ల రోడ్డును చేస్తాననీ హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయకపోగ, తన ఊరికి నాలుగు లైన్ల రోడ్డుని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 48 కిమి ల రోడ్డు కోసం 1200 ఎకరాలు సేకరించి రైతులను దోపిడీ చేసి నిండా ముంచారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణ‌పాఠం చెబుతార‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మెన్ ఎడ్మ సత్యం, వెల్దండ మాజీ జడ్పిటిసి విజిత రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ షాహెద్, మాజీ కౌన్సిలర్లు సూర్య ప్రకాష్ రావు,మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య పాల్గొన్నారు.

Next Story