బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ‘బీరం’ పరామర్శ.....

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-24 11:13:07  IST  )

పాన్ గల్ మండల పరిధిలోని చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరం రంజిత్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని బుధవారం కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ‘బీరం’ పరామర్శ.....
X

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ‘బీరం’ పరామర్శ..

దిశ,పాన్ గల్ : మండల పరిధిలోని చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరం రంజిత్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని బుధవారం కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఎన్ హెచ్-44 రాజాపూర్ దగ్గర కారు ప్రమాదంలో బీరం రాజారెడ్డి, మరదలు హారిక మృతి చెందిన విషయం విధితమే. గత రెండు రోజులుగా అందుబాటులో లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతిడి తల్లిదండ్రులు, భార్యను పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడొద్దు అండగా ఉంటానని భరోసా కల్పించారు. అదేవిధంగా మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన భూషయ్య మృతి చెందగా ఆయన పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెబ్బేటి వీరసాగర్, ఉపాధ్యక్షుడు తిలకేశ్వర్ గౌడ్, మాజీ సర్పంచ్ బాలస్వామి, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి, వెంకట్, రాములు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Next Story