రంగ‌నాథ స్వామిని ద‌ర్శించుకున్న పుదుచ్చెరి మాజీ సీఎం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, శ్రీరంగ‌పూర్ : వ‌న‌ప‌ర్తి జిల్లా డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వీ నియామ‌క మీటింగ్ కి వ‌న‌ప‌ర్తి జిల్లాకు విచ్చేసిన పుదుచ్చెరి మాజీ సీఎం వి.నారాయ‌ణ స్వామి గురువారం మండ‌ల కేంద్రంలోని

రంగ‌నాథ స్వామిని ద‌ర్శించుకున్న పుదుచ్చెరి మాజీ సీఎం
X

దిశ‌, శ్రీరంగ‌పూర్ : వ‌న‌ప‌ర్తి జిల్లా డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వీ నియామ‌క మీటింగ్ కి వ‌న‌ప‌ర్తి జిల్లాకు విచ్చేసిన పుదుచ్చెరి మాజీ సీఎం వి.నారాయ‌ణ స్వామి గురువారం మండ‌ల కేంద్రంలోని రంగ‌నాథ స్వామిని ద‌ర్శించుకున్నారు. స్థానిక నాయ‌కులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య శిల్ప క‌ళ అద్భుతంగా ఉంద‌ని వి.నారాయ‌ణ కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీ అధ్య‌క్షుడు రాజేంద్ర ప్ర‌సాద్, నాయ‌కులు గోవింద్, రాంచంద‌ర్, ఈశ్వ‌ర‌య్య‌, రాములు, గంగాధ‌ర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంలోనే పుదుచ్చెరి మాజీ సీఎం పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు వాల్మికి బోయ‌లు. పీసీసీ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.ల‌క్ష్మినారాయ‌ణ ఆరో వ‌ర్థంతి సంద‌ర్భంగా గురువారం ఆయ‌న విగ్ర‌హానికి స్థానిక వాల్మికి బోయ‌లు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. రంగ‌నాథస్వామి ద‌ర్శ‌నానికి ల‌క్ష్మినారాయ‌ణ స్వ‌గ్రామ‌మైన శ్రీరంగ‌పూర్ కి వ‌చ్చిన పుదుచ్చెరి కాంగ్రెస్ మాజీ సీఎం వి.నార‌య‌ణ స్వామి ల‌క్ష్మినారాయ‌ణ‌కు క‌నీసం నివాళులు కూడా అర్పించ‌క‌పోవ‌డం ప‌ట్ల వాల్మీకి నాయ‌కులు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న జీవితాన్ని కాంగ్రెస్ కి అంకితం చేసిన ల‌క్ష్మినారాయ‌ణ పట్ల స్థానిక నాయ‌కులు చిన్న చూపు చూడ‌టం సరికాద‌న్నారు.

Next Story