పోక్సో కేసులో బాల స‌ద‌న్ మాజీ చైల్డ్ వెల్పేర్ క‌మిటీ స‌భ్యుడికి 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్ష

by Ratna Kumari |   (  Updated:2026-05-20 16:41:47  IST  )

మైనర్ బాలికను బెదిరించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి ఫోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి తమన్ రాజేశ్వరి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 50 వేల నగదు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు.

పోక్సో కేసులో బాల స‌ద‌న్ మాజీ చైల్డ్ వెల్పేర్ క‌మిటీ స‌భ్యుడికి 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్ష
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మైనర్ బాలికను బెదిరించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి తమన్ రాజేశ్వరి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 50 వేల నగదు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ జానకి తెలిపిన ప్రకారం.. జిల్లాలోని ఒక మండలానికి చెందిన మైనర్ బాలిక కు తల్లిదండ్రులు లేకపోవడంతో బాలసదనలో చేర్పించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు ఆ బాలిక సొంత మండలంలోని కేజీబీవీలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ.. సెలవులలో తిరిగి బాల సదన్ లో ఉండేది. బాల సదన్ లో కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునిగా పనిచేస్తూ వచ్చాడు.

ఈ నేపథ్యంలో ఆ బాలికను ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక ఉపాధ్యాయునిల దృష్టికి తీసుకువెళ్లడంతో 2024 మార్చి 17న బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలి వాంగ్మూలాలు, వైద్య పరీక్షలు, ఫోరెన్ సిక్ ఆధారాలు, ఇతర సాక్షాలను సేకరించి కొట్టుకు సమర్పించారు. న్యాయస్థానంలో విచారణ జరిగిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 50వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. దర్యాప్తు చేసిన మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్ట‌ర్ విజయ్ కుమార్, సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ గాంధీ నాయక్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. జాన్, లైసెన్ అధికారి ఏఎస్ఐ బాలకృష్ణ, పీసీలు కృష్ణ, రహీం, శంకర్, అశోక్ రెడ్డిలను ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు.

Next Story