- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వైల్డ్ లైఫ్' వారియర్లను ఏర్పాటు చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి
వన్యప్రాణులను, వాటి నివాసాలను రక్షించడానికి 'వైల్డ్ లైఫ్' వారియర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వన్యప్రాణులను, వాటి నివాసాలను రక్షించడానికి 'వైల్డ్ లైఫ్' వారియర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ జానకి, డీఎఫ్ఓ సత్యనారాయణ, ఫారెస్ట్ రెంజ్ అధికారులతో కలిసి జిల్లాలో వణ్యప్రాణుల సంరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలకై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాలు, మండలాల్లో వన్యప్రాణుల సంరక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని, జంతు సంరక్షణకు గ్రామ సర్పంచ్ లకు శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆమె సూచించారు. వన్యప్రాణుల దాడుల వలన పశునష్టం, పంటల నష్టం జరగకుండా అల్లారం లాంటి వాటిని పెట్టి తగు జాగ్రత్తలకై చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవి జంతువులు ప్రమాదాలకు గురి కాకుండా హట్ స్పాట్ లను గుర్తించి, నేషనల్ హైవే అధికారులతో సంప్రదించి జాగ్రత్తలను చేపట్టాలని ఆదేశించారు. స్నెక్ క్యాచర్లను ఏర్పాటు చేసి గ్రామాలు, పట్టణాల్లో పాములు సంచరిచ్చినప్పుడు వాటిని సురక్షితంగా పట్టుకోని అడవుల్లోకి వదిలేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏ ఒక్క వన్యప్రాణి కూడా ప్రమాదాలకు గురి కావడం కానీ, మరణించడం కానీ జరగకూడదని కలెక్టర్ విజయేందిర బోయి కఠినంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, డిఆర్డీఓ నర్సింహులు, పశుసంవర్ధక శాఖ మధుసూదన్, ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ గణేష్, హ్యూమన్ వైల్డ్ లైఫ్ సంఘర్షణ నోడల్ ఆఫీసర్ ఎ.రాజసింహుడు, జంతుశాస్త్ర అధ్యాపకుడు, పరిశోధకుడు సదా శివ్వయ్య పాల్గొన్నారు.






