15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-04 10:21:33  IST  )

దిశ‌, బెజ్జూర్ : బెజ్జూరు మండలంలో గత 15 రోజులుగా మిషన్ భగీరత నీరు అందక మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికల సమయంలోనైనా

15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు
X

దిశ‌, బెజ్జూర్ : బెజ్జూరు మండలంలో గత 15 రోజులుగా మిషన్ భగీరత నీరు అందక మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికల సమయంలోనైనా మంచినీరు వస్తుందా లేదా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓట్ల కోసం అభ్యర్థులు వస్తే గ్రామాల్లో మంచినీటి కోసం నిలదీస్తామని మహిళలు తెలుపుతున్నారు. బెజ్జూర్ మండలంలోని 22 గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ నీరు రాక మహిళలు ఆందోళన చెందుతున్నారు. గత ఐదు నెలలుగా మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం వల్ల దసరా పండగ ముందు కార్మికులు పనిచేయక పోవడం వల్ల మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. మిషన్ భగీరథ నీరు రాకపోవడం వల్ల మహిళలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించే నిర్మించిన మిషన్ భగీరథ అనే పైప్ లైన్ లో వృధాగా పోతున్నాయి.

మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో బావులను, వాగులను ఆశ్రయించాల్సి వస్తుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా మిషన్ భగీరథ రాకపోవడం.. మరోవైపు కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు ఐదు నెలలుగా పని చేస్తున్నప్పటికీ వేతనాలు లేకపోవడం వల్ల పనిచేయలేకలేకపోతున్నామని సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. పనిచేస్తున్న పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని మిషన్ భగీరథ కార్మికులు తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మిషన్ భగీరథ నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బెజ్జూరు మండల వాసులు కోరుతున్నారు.

Next Story