Food Poison: యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

by Kema Shiva Kumar |

ఫుడ్ పాయిజన్‌ (Food Poison) కారణంగా 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జడ్చర్ల (Judcharla)లోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (NMIMS) యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

Food Poison: యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుడ్ పాయిజన్‌ (Food Poison) కారణంగా 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జడ్చర్ల (Judcharla)లోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (NMIMS) యూనివర్సిటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి (Polepally) వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ (NMIMS University)లో రాత్రి విషాహారం తిని 80 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు అస్వస్థతకు గురయ్యారు. అయితే, విషయం బయటకు పొక్కుకుండా హాస్టల్ నిర్వాహకులు వైద్యులను యూనివర్సిటీకే పిలిపించి విద్యార్థులకు వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయినా, వారి ఆరోగ్యం కుదుటపడకపోవడంతో విషయం బయటకు వచ్చింది. మొదట 27 మంది విద్యార్థులకు మాత్రమే ఫుడ్ పాయిజన్ అయిందని హాస్టల్ నిర్వాహకులు స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం మొత్తం 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. కాగా, బయట ఫుడ్ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని నిర్వాహకులు చెబుతుండగా.. మరోవైపు హాస్టల్ ఫుడ్ తినడం వల్లే తాము అస్వస్థతకు గురైనట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story