ఆహార‌పు అల‌వాట్ల పై అవ‌గాహ‌న పెంచేందుకే ఫుడ్ ఫెస్టివ‌ల్ : ఎంఈఓ గోపాల్ నాయ‌క్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-20 10:25:16  IST  )

దిశ, హన్వాడ : విద్యార్థులకు చదువుతోపాటు ఆహార అలవాట్లపై అవగాహన పెంచేందుకే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని మండల విద్యాశాఖ అదికారి గోపాల్ నాయక్

ఆహార‌పు అల‌వాట్ల పై అవ‌గాహ‌న పెంచేందుకే ఫుడ్ ఫెస్టివ‌ల్ :  ఎంఈఓ గోపాల్ నాయ‌క్
X

దిశ, హన్వాడ : విద్యార్థులకు చదువుతోపాటు ఆహార అలవాట్లపై అవగాహన పెంచేందుకే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని మండల విద్యాశాఖ అదికారి గోపాల్ నాయక్ అన్నారు. హన్వాడ మండలం వేపూర్ గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త‌ పాఠశాలలో శనివారం ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా మదన్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కల్పించడానికి, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఫుడ్ ఫెస్టివల్ ఒక అద్భుతమైన వేదిక అని ఆయన తెలిపారు. విద్యార్థులకు జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలను, ఏ ఆహారంలో ఏ విటమిన్లు ఉంటాయో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ఇంటిదగ్గర వండి తీసుకొచ్చిన పదార్థాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎన్. చెన్నయ్య, ఉప సర్పంచ్ రమేష్ కుమార్, గ్రామ పెద్దలు వెంకట్ రామ్ రెడ్డి, కృష్ణయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story