- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలల్లో పరిశుభ్రత, పరిపాలనా సామర్థ్యం పై దృష్టి సారించాలి
పాఠశాలల్లో పరిశుభ్రతతో పాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు.

దిశ, ఇటిక్యాల/ఎర్రవల్లి : పాఠశాలల్లో పరిశుభ్రతతో పాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఎర్రవల్లి మండల పరిధిలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల ప్రధానోపాధ్యాయులకు గురువారం క్యాంపెయిన్ 5.0 పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల స్థాయిలో విద్యా, అక్షరాస్యత లక్ష్యాలను వివరించారు. పాఠశాలల వాతావరణాన్ని మెరుగుపరచడం, పరిపాలనా వ్యవస్థలను బలోపేతం చేయడం పై ప్రత్యేక దృష్టి పెట్టి, విద్యార్థులకు శుభ్రమైన, సురక్షితమైన, ఉత్తేజకారక అభ్యాస వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
పాఠశాలల మెరుగుదల కోసం రంగులు వేయడం, గోడలకు చిన్నపాటి మరమ్మతులు చేయడం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు సరిగా పనిచేసేలా చూడాలని ఆమె అన్నారు. పాత బోర్డులు, శిథిలమైన లేదా నిరుపయోగంగా ఉన్న వస్తువులను తిరిగి వినియోగంలోకి తెచ్చే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజల భాగస్వామ్యంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వవిద్యార్థులు, పంచాయతీరాజ్ సంస్థలతో సమన్వయం చేసుకొని స్థానిక పాఠశాలల అభివృద్ధికి కృషిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్లు శాంతిరాజు, హంపయ్య, రాజేంద్ర, ఇటిక్యాల ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎర్రవల్లి ఎంఈఓ అమీర్ పాషా, పంచాయతీరాజ్ ఏఈ మహమ్మద్ ఆజామ్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






