ట్రాన్స్ ఫార్మ‌ర్ నుంచి నిప్పు ర‌వ్వ‌లు ప‌డి మొక్క‌జొన్న పంట ద‌గ్దం

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన డొక్కా శ్రీనివాసులు మొక్కజొన్న పంట విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ నుంచి వెలువ‌డిన‌ నిప్పు రవ్వలు అంటుకొని ఆదివారం మ‌ధ్యాహ్నం ద‌గ్ద‌మైంది.

ట్రాన్స్ ఫార్మ‌ర్ నుంచి నిప్పు ర‌వ్వ‌లు ప‌డి మొక్క‌జొన్న పంట ద‌గ్దం
X

దిశ‌, బిజినేప‌ల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన డొక్కా శ్రీనివాసులు మొక్కజొన్న పంట విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ నుంచి వెలువ‌డిన‌ నిప్పు రవ్వలు అంటుకొని ఆదివారం మ‌ధ్యాహ్నం ద‌గ్ద‌మైంది. దాదాపు రెండు లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లిపూర్ గ్రామానికి చెందిన డొక్కా శ్రీనివాసులు తనకున్న 2.10 గుంటల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశారు. చేతికి వచ్చే సమయంలో అదే పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ ఉండ‌టంతో దాని నుంచి వెలువ‌డిన‌ నిప్పు రవ్వలు మొక్కజొన్న పంట పొలంలో ప‌డ్డాయి. పంట‌ అగ్నికి ఆహుతి అయింది. ఇది చూసిన చుట్టుపక్కల రైతులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే రైతుకు తీరని రైతు నష్టమని వాపోతున్నారు. చుట్టుపక్కల రైతులు గమనించి రైతు యజమానికి చెప్పడంతో అక్కడికి చేరుకునే లోపే మొక్కజొన్న పంట మొత్తం ద‌గ్ద‌మైంది. రైతు చేసిన అప్పులు ఎలా తీర్చాలని తన రోదన వర్ణన తీతం. రైతును ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకోవాలని గ్రామ రైతు సంఘాలు, రైతులు, సర్పంచ్, నాయకులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story