- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెగిపడిన విద్యుత్ తీగలు తాకి ఐదు పొట్టేళ్లు మృతి
ఇటీవల వీచిన పెనుగాలులకు వ్యవసాయ పొలంలో తెగిపడిన విద్యుత్ తీగలు తాకి ఐదు పొట్టేళ్లు మృతి చెందాయి.

X
దిశ, పెద్దకొత్తపల్లి : ఇటీవల వీచిన పెనుగాలులకు వ్యవసాయ పొలంలో తెగిపడిన విద్యుత్ తీగలు తాకి ఐదు పొట్టేళ్లు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్గం నాగశేషు ఐదు పొట్టేళ్ల ను పెంచుతున్నాడు. వీటిని మేతకు కోసం తన వ్యవసాయ పొలానికి తీసుకెళ్లాడు. అయితే శనివారం సాయంత్రం వీచిన పెనుగాలులకు వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ తీగలను తాకిన ఐదు పోటెళ్ళు విద్యుదాఘా తానికి గురై అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. వీటి విలువ రూ. 90 వేలు ఉంటుందనీ బాధితుడు బోల్గాం నాగశేషు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆయన కోరారు.
Next Story






