షార్ట్ స‌ర్క్యూట్ తో ఐదు క్వింటాళ్ల ప‌త్తి ద‌గ్దం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, న‌ర్వ‌ : నర్వ మండలంలోని లక్కీర్ దొడ్డి నరసింహ వరండాలో నిలువ ఉంచిన పత్తి షార్ట్ సర్క్యూట్ తో దాదాపు ఐదు క్వింటాళ్ల‌ పత్తి ద‌గ్ద‌మైంద‌ని లక్కీ దొడ్డి నరసింహ

షార్ట్ స‌ర్క్యూట్ తో ఐదు క్వింటాళ్ల ప‌త్తి ద‌గ్దం
X

దిశ‌, న‌ర్వ‌ : న‌ర్వ మండ‌లంలో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా 5 క్వింటాళ్ల ప‌త్తి ద‌గ్దం అయింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మండ‌ల కేంద్రంలోని లక్కీర్ దొడ్డి నరసింహ వరండాలో నిలువ ఉంచిన పత్తి షార్ట్ సర్క్యూట్ తో దాదాపు ఐదు క్వింటాళ్ల‌ పత్తి ద‌గ్ద‌మైంది. ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పండించగా.. వెరీ పత్తిని తెచ్చి తన ఇంటి వరండాలో వేయగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎవ్వ‌రూ లేని సమయాన పత్తి ద‌గ్ద‌మైన‌ట్టు లక్కీ దొడ్డి నరసింహులు తెలియజేశారు. కష్టపడి పండించిన పంట దగ్దం కావడంతో కన్నీరు మున్నీరుతో వెల వెల బోతున్నాడు. వడ్డీ రైతులతో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి లాస్ట్ కు నోటికాడి బుక్క చేతికి అంద‌కుండా పోవడంతో నరసింహులు మనో ఆవేదనకు గురయ్యాడు. అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని ప్రభుత్వంఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Next Story