మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

by Ratna Kumari |

మండల పరిధిలోనీ రామాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని బాలయ్య (39) కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సురగౌని నిర్మల నిరంజన్ గౌడ్ గురువారం పరామర్శించారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
X

దిశ, కొల్లాపూర్ : మండల పరిధిలోనీ రామాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని బాలయ్య (39) కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సురగౌని నిర్మల నిరంజన్ గౌడ్ గురువారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం 50 కేజీల బియ్యం, రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో పార్టీ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మ గోపాల్ యాదవ్, ఉప సర్పంచ్ పరశురాముడు, వార్డు సభ్యులు బిజ్జుల శేఖర్ రెడ్డి, రాజు, నాయకులు రామస్వామి యాదవ్, ఆకునమోని దర్గయ్య, ఆడేం నిరంజన్, గడ్డం మల్లేష్ యాదవ్,మోసం బాలయ్య, గడ్డం కురుమయ్య, చాకలి శేఖర్ పాల్గొన్నారు.

Next Story