- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఇంటికి ఆర్థిక సాయం
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఇంటి ఘటన పట్ల మానవతా దృక్పథంతో స్పందించిన ప్రతినిధులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

దిశ, వంగూర్ : నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఇంటి ఘటన పట్ల మానవతా దృక్పథంతో స్పందించిన ప్రతినిధులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి, ఇంటి సామగ్రి నష్టం వాటిల్లడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామ సర్పంచ్ పురుగుల యాదయ్య ఆయనతోపాటు మరి కొంతమంది నాయకులు వెంటనే ముందుకొచ్చి వారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ అవసరాల నిమిత్తం రూ.12 వేలు ఆర్థిక తోడ్పాటును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అందిన సహాయం కుటుంబానికి కొంతమేర ఊరటనిచ్చిందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాస్కర్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గణేష్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదగిరి రావు, వార్డ్ మెంబర్స్ రఫీ, శివకుమార్, మల్లేష్, సత్యనారాయణ, గ్రామ నాయకులు పాల్గొన్నారు.






