అంత్యక్రియ‌ల‌కు ఆర్థిక స‌హాయం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మిడ్జిల్ : మండ‌ల ప‌రిధిలోని డీలర్ జంగయ్య బ్రెయిన్ స్టాక్ తో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అంత్యక్రియ‌ల‌కు ఆర్థిక స‌హాయం
X

దిశ‌, మిడ్జిల్ : మండ‌ల ప‌రిధిలోని డీలర్ జంగయ్య బ్రెయిన్ స్టాక్ తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కల్వకుర్తి - జడ్చర్ల ప్రధాన రహదారిపై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అంబేద్కర్ సంఘం సభ్యులు అంత్యక్రియలకు రూ.20 వేలు, మండల డీలర్ల అసోసియేషన్ సభ్యులు 10 వేలు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దేవయ్య, మాజీ సర్పంచ్ శారదా వెంకటయ్య, మాజీ ఎంపీపీ సుదర్శన్, నాయకులు సుధా బాల్ రెడ్డి, డిష్ బాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గౌస్, సంపత్ కుమార్, నరేందర్ రెడ్డి, బాలయ్య, రాములు, బుచ్చయ్య, ఆచారి , శేఖర్, జగదీష్, రవీంద్ర, శ్రీనివాస్, ప్రతాప్ , సురేష్, ప్రభు దాసు, వెంకటయ్య, గోపాల్, బాలస్వామి, ఉస్మాన్ ,జహీర్, యాదయ్య, మల్లేష్ పాల్గొన్నారు.

Next Story