ఎట్ట‌కేల‌కు అడ్డంకుల‌ను అధిగ‌మించి సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు మార్క్..!

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : ప్ర‌తిప‌క్షాలు కల్పించిన అడ్డంకుల‌ను అధిగ‌మించిన మ‌క్త‌ల్ ట్యాంక్ బండ్ పై సుంద‌రీక‌ర‌ణ పై అభివృద్ధి ప‌నుల‌కు శ‌నివారం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీరాములు ఆధ్వ‌ర్యంలో ఇంజినీర్ నాగ‌శివ

ఎట్ట‌కేల‌కు అడ్డంకుల‌ను అధిగ‌మించి సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు మార్క్..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : ప్ర‌తిప‌క్షాలు కల్పించిన అడ్డంకుల‌ను అధిగ‌మించిన మ‌క్త‌ల్ ట్యాంక్ బండ్ పై సుంద‌రీక‌ర‌ణ పై అభివృద్ధి ప‌నుల‌కు శ‌నివారం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీరాములు ఆధ్వ‌ర్యంలో ఇంజినీర్ నాగ‌శివ మార్క్ ఔట్ ఇచ్చారు. మ‌క్త‌ల్ మున్సిపాలిటీ ఏర్ప‌డిన త‌రువాత పెద్ద చెరువును అభివృద్ధి ప‌నుల‌కు నిధులు మంజూరైన అభివృద్ధి ప‌నుల‌ను మ‌ధ్య‌లో వ‌దిలేశారు. ట్యాంక్ బండి పై విశాలంగా ఉన్న స్థ‌లంలో ప్ర‌జ‌ల‌కు జాతీయ ర‌హ‌దారి 167 రాక‌పోక‌లు సాగించే ప్ర‌యాణికులకు విశ్రాంతి తీసుకునేలా విశ్రాంతి భ‌వ‌నాలు, కాటేజీలు, వ్యాపార స‌ముదాయాలు, టాయిలెట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహ‌రి రూ.3కోట్ల 70 ల‌క్ష‌ల‌ను ప్ర‌భుత్వం నుంచి మంజూరు తీసుకొచ్చారు. గ‌త ఏడాది ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల అడ్డంకుల వ‌ల్ల అభివృద్ధి ప‌నులు నిలిచిపోయాయి.


ఈ ప‌నుల‌ను కొన‌సాగించ‌డానికి ట్యాంక్ బండ్ పై సుంద‌రీక‌ర్ణ నిర్మాణాల‌కు అడ్డంకులు లేకుండా నిర్మాణాలు కొనసాగ‌డానికి మంజూరైన నిధులు తిరిగి వెళ్ల‌కుండా ప్ర‌స్తుతం మంత్రి వాకిటి శ్రీహ‌రి ఇరిగేష‌న్ శాఖ అధికారుల‌తో మంత్రి వాకిటి శ్రీహ‌రి చ‌ర్చించి ఎన్ఓసీ జాతీయ ర‌హ‌దారి ప‌ది పీట్ల నిర్మాణ ప‌నుల‌కు అనుమ‌తి, ఆర్ అండ్ బీ అధికారుల నుంచి అనుమ‌తి, బిల్డింగ్ అప్రూవ‌ల్ కోసం డీటీపీసీ అప్లోల్ చేసుకోవ‌డం అధికారుల‌ను వెన్ను త‌ట్టాడు. ట్యాంక్ బండ్ పై ఉన్న విశాల స్థ‌లంలో జీ ప్ల‌స్ వ‌న్ బిల్డింగ్ కాంప్లెక్స్ టాయిలెట్ బాక్స్, పార్కింగ్ ప్లేస్ గ్రీన‌రీ అభివృద్ధి ప‌ర‌చ‌డం ప‌నుల‌ను చేయాల్సి ఉంటుంద‌ని.. దీంతో పాటు ర‌హ‌దారి పొడ‌వునా 12 వ్యాపార స‌ముదాయ దుకాణాలు మొద‌టి అంత‌స్తులు యాత్రికుల విశ్రాంతి కోసం 12 బెడ్ రూమ్ నిర్మాణ ప‌నుల‌కు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీరాములు, ఇంజినీర్ నాగ‌శివ శ‌నివారం మార్క్ చేశారు.

Next Story