- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తోటి స్నేహితులు హృదయపూర్వక సహాయం
by Ratna Kumari |
దిశ, మహమ్మదాబాద్ : మండలం నంచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ మానవతా విలువలను చాటుకున్నారు. 2010, 2011 బ్యాచ్ పదో తరగతి మిత్రులు కుమ్మరి వెంకటమ్మ

X
దిశ, మహమ్మదాబాద్ : మండలం నంచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ మానవతా విలువలను చాటుకున్నారు. 2010, 2011 బ్యాచ్ పదో తరగతి మిత్రులు కుమ్మరి వెంకటమ్మ కుమార్తె అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించడంతో, బాధలో ఉన్న కుటుంబానికి తోచిన ఆర్థిక సాయం అందిస్తూ మిత్రులు ఆదర్శంగా నిలిచారు. సహ విద్యార్థులు ఆపదలో అండగా ఉండాలనే భావంతో ముందుకొచ్చిన మిత్రులు అందరూ కలిసి కుమ్మరి వెంకటమ్మ ని పరామర్శించి, సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి ఆ పాలిట అత్యవసర సమయంలో ఆర్థికంగా తోడ్పడటమే తమ బాధ్యతగా భావించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయవర్ధన్ రెడ్డి, నరేష్, కాశీం, రాములు, యాదమ్మ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






