కొడుకు పై తండ్రి కత్తితో దాడి

by Ratna Kumari |

క‌న్న తండ్రి కొడుకు పై కత్తితో దాడి చేశాడు. దీంతో కొడుకు కి తీవ్ర గాయాల‌య్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ సంఘ‌ట‌న రాంచంద్రాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

కొడుకు పై తండ్రి కత్తితో దాడి
X

దిశ,సైదాపూర్ : కన్న కొడుకు పై మద్యం మత్తులో తండ్రి కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పెరుగు రవిందర్ అనే వ్యక్తి మద్యానికి బానిసై ఇంటి వద్ద ఉండకుండా తిరుగుతున్నాడని తెలిపారు. మంగళవారం ఎలాబోతారం గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపల్లి గోదాముల వద్ద రవీందర్ కుమారుడైన పెరుగు నరేష్ కనిపించడంతో ఇంటి వద్ద దుర్గమ్మ పూజా కార్యక్రమం చేస్తున్నాము ఇంటికి రమ్మని పిలచాడు. ఇంటికి రానంటూ అత‌ని వద్ద ఉన్న కత్తితో త‌న కుమారుడు నరేష్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. నరేష్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి తెలిపారు.

Next Story