- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వసతులు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు
ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఆర్బాటంగా ఆదివారం ప్రారంభించినప్పటికీ, మంగళవారం వరకు రైతులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఆర్బాటంగా ఆదివారం ప్రారంభించినప్పటికీ, మంగళవారం వరకు రైతులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగులు అందుబాటులో లేక రైతులు ధాన్యాన్ని నిల్వ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. త్రాగునీటి సౌకర్యం లేక రైతులు అవస్థలు పడుతుండగా, ఎండ తీవ్రత కారణంగా నీడ కోసం టెంట్ ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి ఎండలోనే వేచి ఉండాల్సి వస్తోంది. రైతులు కొనుగోలు కేంద్రానికి సమీపంలో ఉన్న చింత చెట్టు కిందికి వెళ్లి సేదతీరుతున్నారు.
టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో ఎప్పుడూ వర్షం పడుతుందో అని ధాన్యం రక్షణపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు తెలియజేయాల్సిన ధరల పట్టిక, తేమ శాతం, తరుగు పట్టికలను కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ధరలు, తేమ శాతం వివరాలు స్పష్టంగా ప్రదర్శించకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. వెంటనే గన్ని బ్యాగులు, త్రాగునీరు, టెంట్లు, టార్పాలిన్ కవర్లు, ధరల పట్టికలు, తేమ తరుగు వివరాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు పై అధికారులను కోరుతున్నారు.






