రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి : అదనపు కలెక్టర్ మ‌ధు మోహన్

by Ratna Kumari |

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ అధికారులను ఆదేశించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి :  అదనపు కలెక్టర్ మ‌ధు మోహన్
X

దిశ‌, ఉండ‌వెల్లి : రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అలంపూర్ చౌరస్తా లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ యార్డు గోదాములోని నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల వివరాలు సంబంధిత అధికారులు, రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. మార్కెట్ కి వచ్చిన మొక్కజొన్న కొనుగోలు చేయటంతో పాటు కొనుగోలు చేసిన మొక్కజొన్న వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Next Story