రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-11 12:13:04  IST  )

దిశ, కామారెడ్డి : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ, కామారెడ్డి : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం అకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మట్లాడి వరి కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం, తూకం విధానం, ధాన్యం నిల్వ సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే కేంద్రంలో తూకం యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా, తగిన బస్తాల సరఫరా జరుగుతున్నదా అనే అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు నిర్వహించాలని, తేమ శాతం ఆధారంగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

ధాన్యం ఎండబెట్టే ప్రదేశాలను పర్యవేక్షించి అవసరమైన సూచనలు, సలహాలు చేశారు. రైతులు సమయానికి చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ ల పనితీరును వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 427 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు రైతుల నుండి కొనుగోలు చేసింది 1,23,993 మెట్రిక్ టన్నులు కాగా ఇందులో దొడ్డురకం 59,162, సన్నరకం 64,831 టన్నులు అన్నారు. 11,196 మంది రైతుల నుండి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 145 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లై వెంకటేశ్వర్లు, డీఎమ్ శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, ఎంపీడీవో, పంచాయితీ సెక్రటరి, రైతులు పాల్గొన్నారు.

Next Story