రైతుల నిరసన.. ఇంతకీ ఏమైనట్టు..?

by Naveena |

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామంలో రైతులు నిరసన చేశారు.

రైతుల నిరసన.. ఇంతకీ ఏమైనట్టు..?
X

దిశ, ఉప్పునుంతల: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామంలో రైతులు నిరసన చేశారు. కేఎల్ఐ కాలువ వల్ల నష్టపోయిన రైతులు, జరుగుతున్న పనులను నిలిపి వేసి ఆందోళన చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, ప్రభుత్వం ఇష్టానుసారంగా పనులు చేసుకుంటూ పోవడం జరుగుతుందని వాపోయారు. కాలువ వల్ల రైతులు భూమి కోల్పోవడంతో పాటు, ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. కేఎల్ఐ అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు పరిహారం అందించాలన్నారు. ఈ నిరసన లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story