- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజిల్ కొరతతో రైతులకు ఇబ్బందులు
ఇటీవల కురిసిన వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో నారాయణపేట జిల్లా రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేశారు.

దిశ, నారాయణపేట /ఊట్కూర్ : ఇటీవల కురిసిన వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో నారాయణపేట జిల్లా రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. పొలాల చదును, దున్నే పనుల కోసం ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను వినియోగిస్తున్న సమయంలో జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. డీజిల్ కోసం రైతులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొన్ని బంకుల్లో డీజిల్ నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో రైతులు ఒక బంక్ నుంచి మరో బంక్‌కు తిరుగుతున్నారు. డీజిల్ అందుబాటులో లేక ట్రాక్టర్లు నిలిచిపోవడంతో వ్యవసాయ పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చిన వెంటనే సాగు పనులు పూర్తి చేయాల్సిన సమయంలో డీజిల్ సమస్య ఎదురుకావడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు తెలిపారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితులు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అలాగే పలుచోట్ల డీజిల్ బంక్ కు సంబంధించిన వ్యక్తులకు రైతులకు చిన్న చిన్న వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి పెట్రోల్ బంకుల్లో డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.






