- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వే బ్రిడ్జ్ తూకాల్లో మోసాలు.. నివృత్తి చేయాలని రైతులు డిమాండ్
దిశ, మక్తల్ : రైతులకు పత్తి పంట చేతికి రావడంతో ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి పత్తి మిల్లు కేంద్రాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దిశ, మక్తల్ : రైతులకు పత్తి పంట చేతికి రావడంతో ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి పత్తి మిల్లు కేంద్రాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతంలో ఉన్న కాటన్ మిల్లుల ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వే బ్రిడ్జ్ తూకాలో మోసాలు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక నిరోధక సౌకర్యాలు ఉన్న కాటన్ మిల్లులోనే పత్తి కోనుగోలుకు ఎంపిక చేసి పత్తిలో 12శాతం కన్న ఎక్కువ తేమా ఉన్న ప్రభుత్వం ప్రకటించినా మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మక్తల్ మండలంలోని లింగంపల్లి గ్రామపంచాయతీలో ఉన్న కాటన్ మిల్లులో గత ఏడాది మిల్లులో ఉన్న వే బ్రిడ్జీలో తూకంలో కొన్ని తేడాలు వచ్చాయని.. రైతులను మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
మాగనూరు మండలంలోని ఓ రైతు ట్రాక్టర్ లో పత్తిని లోడ్ చేసుకొని ప్రైవేట్ వే బ్రిడ్జీలో తూకం వేస్తే.. 9,130 బరువు వచ్చినట్టు రీసీప్ట్ తీసుకున్నాడు. కానీ ఆ రైతు లింగంపల్లి గ్రామపంచాయతీలో ఉన్న కాటన్ మిల్లులో పత్తి అమ్మకానికి తీసుకెళ్లి అక్కడ ఉన్న వే బ్రిడ్జీలో తూకం వేస్తే.. 980 కేజీలు తేడా వచ్చింది. అనగా 8,150 కిలోలు మాత్రమే చూపించింది. అక్కడ 9,130 కిలోలు.. ఇక్కడ 8,150 కిలోలు అని రైతులకు-యజమానులకు గొడవ జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిగించారు. అనంతరం తూనికల కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వే బ్రిడ్జీని తనీఖీలు చేశారు. రైతు తీసుకొచ్చిన ట్రాక్టర్ లోడ్ ను వే బ్రిడ్జ్ పై ఉంచి తూకం వేయడంతో దాదాపు 50 కిలోలకు పైగా తూకంలో తేడా ఉందని తూనికల శాఖ అధికారులు గుర్తించారు.
ఆ వే బ్రిడ్జిని తనిఖీ చేయగా.. నాలుగేళ్ల క్రితం మిల్లు ప్రారంభంలో వేసిన వే బ్రిడ్జీను ప్రతీ సంవత్సరం తూనికల కొలతల అధికారులతో తనిఖీ చేయించి సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధనను గాలికి వదిలేశారు. తప్పుడు తూకంతో రైతుల నుంచి పత్తిని సేకరించి మిల్లు యజమాని లబ్ది పొందాడు. వే బ్రిడ్జిలో మోసాలు ఉన్నందుకు మిల్లు యజమానికి దాదాపు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించి మిల్లులో పత్తి కొనుగోలుని నిలిపివేశారు. సోమవారం మక్తల్ మండలంలో లింగంపల్లి, గుడిగండ్ల గ్రామం దగ్గర పత్తి మిల్లులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి మంత్రి వాకిటి శ్రీహరి సిద్ధమయ్యారు. వేబ్రిడ్జి ని తనిఖీ చేసి తూకాలో ఎలాంటి మోసాలు లేవని నిరూపించే సర్టిఫికెట్ ను బహిర్గతం చేసి రైతులకు ఉన్న అనుమానాలను మంత్రి వాకిటి శ్రీహరి నివృత్తి చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.






