- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పామ్ ఆయిల్ సాగుతో రైతులకు లాభం: వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్
ఫామ్ ఆయిల్ సాగుతో రైతులకు లాభదాయకం అని ఎర్రవల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండలం పుటాన్ దొడ్డి గ్రామ రైతు వేదికలో ఫామ్ ఆయిల్ సాగు పై రైతులకు అవగాహన నిర్వహించారు.

దిశ, ఎర్రవల్లి : ఫామ్ ఆయిల్ సాగుతో రైతులకు లాభదాయకం అని ఎర్రవల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండలం పుటాన్ దొడ్డి గ్రామ రైతు వేదికలో ఫామ్ ఆయిల్ సాగు పై రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానవన పంటలలో ప్రస్తుతం మార్కెట్ ఉన్న పంట ఆయిల్ పామ్ మాత్రమే, ఆయిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని సాగు చేసే పంట రైతులు అమ్మడానికి కూడా ఇబ్బందులు లేకుండా ఫామ్ ఆయిల్ సాగు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. సబ్సిడీ కింద మొక్కలు డ్రిప్పు అందించడమే కాకుండా, నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తుంది. దిగుబడి ప్రారంభమయ్యే లోపు అంతర్ పంటల ద్వారా సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. వరి పత్తి పంటలతో పోలిస్తే పెట్టుబడి కూడా తక్కగానే ఉంటుంది. అలాగే తక్కువ శ్రమతో అదిక లాభాలు సాధించే అవకాశం ఉంది. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధిక సబ్సిడీలతో పాటు గ్యారెంటీ ధర కల్పిస్తున్నందున దళారుల ప్రమేయం లేకుండా లాభాలు నేరుగా రైతులకే అందుతాయని తెలిపారు.
దీర్ఘకాలిక భరోసా..
ఆయిల్ పామ్ ఒకసారి నాటితే 25-30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందని.. ఇది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రాసెసింగ్ మిల్లు ఏర్పాటు..
బీచుపల్లి వద్ద త్వరలోనే ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనివల్ల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ (9515241250) సంప్రదించాల్సిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హిమబిందు, ప్రవల్లిక, నరేష్, రైతులు పాల్గొన్నారు






