- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
by Ratna Kumari |
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలోని రాహుల్ చెరువు తండాలో చోటు చేసుకుంది.

X
దిశ, బిజినేపల్లి : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలోని రాహుల్ చెరువు తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. . మూడవత్ పీర్ నాయక్ (40) రైతు విద్యుత్ షాక్ తో మరణించాడు. ఎప్పటిలాగానే పొలానికి వెళ్లిన పీర్ నాయక్.. రాత్రి సమయం అయినా తిరిగి తండాకు చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ ఘాతానికి గురై పడి ఉండటంతో కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి మృతి చెందటంతో వీరి రోధన చూసిన తండావాసులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు. మృతి చెందిన రైతును ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని సర్పంచ్ తో పాటు తండా వాసులు కోరుతున్నారు.
Next Story






