లింగాలలో కుటుంబ గొడవ.. ముగ్గురిపై కేసు

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో కుటుంబ వివాదం హింసాత్మకంగా మారింది. గ్రామానికి చెందిన కొప్పరాజు మల్లికార్జున్ (38) ఇంట్లో కోడి చనిపోయిన విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

లింగాలలో కుటుంబ గొడవ.. ముగ్గురిపై కేసు
X

దిశ, లింగాల : నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో కుటుంబ వివాదం హింసాత్మకంగా మారింది. గ్రామానికి చెందిన కొప్పరాజు మల్లికార్జున్ (38) ఇంట్లో కోడి చనిపోయిన విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై భార్యను మందలించిన నేపథ్యంలో మల్లికార్జున్ మామ ప్యారం రత్నయ్య, బావమరుదులు ప్యారం వెంకటేష్, ప్యారం శేఖర్‌లు వచ్చి అతనిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్యారం వెంకటేష్ అక్కడ ఉన్న కట్టెతో మల్లికార్జున్ తలపై కొట్టడంతో రక్తగాయం అయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరూ చేతులతో కొట్టినట్లు ఫిర్యాదు చేశాడు. గాయపడిన మల్లికార్జున్ లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.

Next Story