యూరియా అధిక వాడకం తగ్గించాలి

by Elthuri vijay kumar |

రైతులు పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు.

యూరియా అధిక వాడకం తగ్గించాలి
X

యూరియా అధిక వాడకం తగ్గించాలి

రైతుకు అందుబాటులో యూరియా

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్

దిశ,మిడ్జిల్ : రైతులు పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు. మండలానికి 90.45 టన్నుల యూరియా వచ్చిందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా సరఫరా అవుతుందని ఎవరు అధైర్య పడద్దని సూచించారు. రైతు సేవ కేంద్రంలో సరఫరా చేస్తున్న యూరియాను ఆయన పరిశీలించారు. మోతాదుకు మించి యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి రైతులకు ఎక్కువ ఖర్చు, తక్కువ దిగుబడి వస్తుందన్నారు. మండలానికి సరిపడా యూరియా సరఫరా చేయడం జరుగుతుందని స్పష్టంగా తెలిపారు. ఆయనతోపాటు మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధార్థ , ఏఈలు సాయి కృష్ణ భగత్ , తదితరులు ఉన్నారు.

Next Story