ప్రజా పాలన అభివృద్ధికి ప్రజలిచ్చిన తీర్పే నిదర్శనం : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రెండేళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేసిన సంక్షేమం, అభివృద్ధికి నిదర్శనమే మొదటి దశ గ్రామ పంచాయతీ

ప్రజా పాలన అభివృద్ధికి ప్రజలిచ్చిన తీర్పే నిదర్శనం :  డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రెండేళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేసిన సంక్షేమం, అభివృద్ధికి నిదర్శనమే మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని తేలిపోయిందని, ఇది ప్రతి పక్షాలు రెఫరెండం గా భావించాలని ఆయన అన్నారు. గత పదేళ్ళ కాలంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయి, నిధులు కెటాయించక సర్పంచ్ లు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కొకోల్లలని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ది కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి అని, ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని, రెండవ దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించి అభివృద్ధికి దోహదపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story