- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరికీ సామాజిక స్పృహ కలిగి ఉండాలి :ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి
దిశ, కొత్తకోట : ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో జీవిస్తూ ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలని మీరాసిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్

దిశ, కొత్తకోట : ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో జీవిస్తూ ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలని మీరాసిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం స్నేహ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం,మీరాసిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలోని ఆరోతరగతి నుంచి తొమ్మిదోవ తరగతుల విద్యార్థిణి, విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్నేహ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఆయా గ్రామాలలోని పేద విద్యార్థులందరికీ బ్యాగులు, నోటుబుక్కులు, వితరణ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్తులోను ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు బెల్టులు, బూట్లయితేనేమి అందించేందుకు స్నేహ ఫౌండేషన్ ముందుకురావడం సంతోషకరమన్నారు. విద్యార్థిని,విద్యార్థులు చక్కగా చదువుతోపాటు,క్రీడలలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకొని పాఠశాలకు, మీరాసిపల్లి గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కర్నాటి శేఖర్ రెడ్డి, గంగవరం శ్యామ్ సుందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






