- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పథకం ప్రజలకు చేరాలి : ఎంపీ మల్లు రవి
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, నాగర్ కర్నూల్ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని దిశ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు.

దిశ,నాగర్ కర్నూల్: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, నాగర్ కర్నూల్ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని దిశ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను అధికారులు సమిష్టి సహకారంతో పని చేసి లబ్ధిదారులకు అందించాలని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు పి అమరేందర్,దేవ సహాయం, లతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి నిర్వహించారు.
ఈ సందర్భంగా, జాతీయ రహదారులు, ఎస్సీ కార్పొరేషన్ , వివిధ సంక్షేమ శాఖల రుణాలు విద్య, వైద్య గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం,గ్రామీణాభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయతీ రాజ్,శిశు సంక్షేమం,పౌర సరఫరాలు, పరిశ్రమల శాఖల, అధికారులతో వారు చేపట్టిన పనులపై సమీక్షించారు. ఆయాశాఖల పనితీరును సమీక్షించిన డాక్టర్ మల్లు రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రగతిపథంలో ముందుంచాలని, అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందుండాలంటే జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పనులు, ప్రభుత్వ ప్రణాళికలు, లక్ష్యాలు అన్నిశాఖలు సాధించి తీరాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తనకు, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లు జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలను అందించాలన్నారు.వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించే విధంగా పంట రుణాలు, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు విరివిగా రుణాలు అందించాలని జాతీయ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులకు సూచించారు.






