- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఉద్యోగి నిజాయితీతో పని చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రతి ఉద్యోగి నిజాయితీతో అవినీతి రహితంగా, పారదర్శకంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఉద్యోగులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రతి ఉద్యోగి నిజాయితీతో అవినీతి రహితంగా, పారదర్శకంగా పని చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఉద్యోగులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 27 నుండి నవంబర్ 2 వరకు నిర్వహించే 'విజిలెన్స్ అవగాహన వారోత్సవం' కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ శాఖ ద్వారా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు ఎటువంటి లోపం లేకుండా బాధ్యతతో అందించాలని, 'విజిలెన్స్-అందరి బాధ్యత' అనేది ఉద్యోగుల గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీస్ లో చేరినప్పుడు 'కోడ్ ఆఫ్ కండక్ట్' ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని, ప్రతి శాఖ ఉద్యోగి తన శాఖ పరిధిలో చేయాల్సిన సేవలు అందించాలని అన్నారు. జిల్లా కేంద్రం నుండి గ్రామం వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో విధి నిర్వహణలో నిజాయితీతో కూడిన సేవలను అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.ఆనంద్ కుమార్, ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారి, హైద్రాబాద్ సిటీ 2 యూనిట్, విజిలెన్స్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ నవీన్, విజిలెన్స్ తహశీల్దార్ రాజశేఖర్, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శన..
మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న(మక్కలు) కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. మక్కలు ఎండబెట్టి శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని ఆమె సూచించారు. అనంతరం పట్టణ సమీపంలోని అప్పాయపల్లి గ్రామంలో మెసర్స్ ఇండస్ట్రీస్ కాటన్ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ సందర్శించి పత్తి రైతులతో మాట్లాడారు.తసూచించారు.అనంతరం పత్తిని 'కపాస్ అప్ లో స్లాట్' బుక్కింగ్ చేసుకొని వస్తే సిసిఐ పత్తి ని కొనుగోలు చేస్తుందన్నారు. 'మొంథా తుఫాన్' కారణంగా రేపు, ఎల్లుండి వర్షం పడితే అవకాశం ఉన్నందున రైతులు తమ సరకులను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.






