ప్ర‌తి ఉద్యోగి ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న్ సూచ‌న‌లు పాటించాలి

by Ratna Kumari |

ప్ర‌తి ఉద్యోగి ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న్ సూచ‌న‌లు పాటించాల‌ని మున్సిప‌ల్ ఎన్నిక‌ల అబ్జ‌ర్వ‌ర్ శ్యామ్ ప్ర‌సాద్ లాల్ పేర్కొన్నారు.

ప్ర‌తి ఉద్యోగి ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న్ సూచ‌న‌లు పాటించాలి
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : ప్ర‌తి ఉద్యోగి ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న్ సూచ‌న‌లు పాటించాల‌ని మున్సిప‌ల్ ఎన్నిక‌ల అబ్జ‌ర్వ‌ర్ శ్యామ్ ప్ర‌సాద్ లాల్ పేర్కొన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల మైక్రో అబ్జ‌ర్వ‌ర్, పీవోలు, ఏపీవోల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలో ఐదు మున్సిపల్ పరిధిలో జరిగే ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్క ఉద్యోగి పక్కాగా ఎన్నికల సంఘం కమిషన్ సూచించిన నిబంధనలు రూల్ ప్రకారం నడుచుకోవాలని, ప్రతి ప్రశ్నకు ఎన్నికల బుక్ లో సమాధానాలు ఉంటాయని తెలిపారు. ఎలాంటి సందేహాలు వచ్చిన మాస్టర్ ట్రైనర్స్, పై అధికారులను వెంటనే సంప్రదించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి సమన్వయంతో కలిసి పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, మాస్టర్ ట్రైనర్స్ రాములు, ప్రవీణ్, దాశరధి శ్రీధర్, కృష్ణవేణి పాల్గొన్నారు.

Next Story