- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలక్షన్స్ పై కన్నెర్ర చేసిన ఎర్రవెల్లి
దిశ, చారకొండ : రిజర్వాయర్ లో మునిగి ఉనికి కోల్పోయే ఊరికి ఎన్నికలు ఎలా పెడ్తారు అంటూ ...మాకు న్యాయం జరిగే వరకు ఏ ఎన్నికలలో పాల్గొనబోమని ఎర్రవెల్లి - గోకారం

దిశ, చారకొండ : రిజర్వాయర్ లో మునిగి ఉనికి కోల్పోయే ఊరికి ఎన్నికలు ఎలా పెడ్తారు అంటూ ...మాకు న్యాయం జరిగే వరకు ఏ ఎన్నికలలో పాల్గొనబోమని ఎర్రవెల్లి - గోకారం రిజర్వాయర్ ముంపు బాధితుల గ్రామాలైన ఎర్రవెల్లి, ఎర్రవెల్లి తాండా గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.ఇరు గ్రామాల ప్రజలు అధికారులను, ప్రజాప్రతినిధుల వద్ద తమ గోడు ఎంత చెప్పుకున్నా ఎగతాళిగా చూస్తున్నారని గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాటం చేస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందులో భాగంగా శాంతియుతంగా ఎన్నికలను బహిష్కరించి,కొన్ని రోజులు గా రిలే నిరాహారదీక్షలు చేపట్టామని తెలిపారు.ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ నుండి ఎన్నికల నామినేషన్ల చివరిరోజు వరకు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ఒక్కటి కూడా దాఖలు కాలేదని గోకారం క్లస్టర్ ఎన్నికల అధికారి వై.రామకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు స్పందిస్తూ ఎన్నికలు బహిష్కరించిన పరిస్థితి ని అర్థం చేసుకొని రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి మమ్ముల్ని కాపాడాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ప్రజాసంఘాల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.






