ప్రాణ రక్షకులకు ప్రోత్సాహం

by Ratna Kumari |

దిశ, కందనూల్ : రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం రాహ్ వీర్ పథకం ద్వారా ప్రోత్సాహకాలు

ప్రాణ రక్షకులకు ప్రోత్సాహం
X

దిశ, కందనూల్ : రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం రాహ్ వీర్ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, బాధితుల ప్రాణ రక్షణకు దోహదపడే రాహ్ వీర్ పథక మార్గ దర్శకాలతో రూపొందించిన కరపత్రాలను జిల్లా ఎస్పీ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో బాధితులకు సహాయం చేసిన పౌరులపై ఎలాంటి పోలీస్ హరాస్మెంట్, విచారణ ఉండదన్నారు. ప్రమాదం జరిగినప్పుడు నిర్భయంగా బాధితులను ఆసుపత్రిలో చేర్చేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేసిన మంచి సమారిటన్లకు రూ.5 వేల నగదు బహుమతి, ప్రశంస పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. విశిష్ట సేవలందించిన వారిని ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి అవార్డు కార్యక్రమంలో సత్కరించనున్నట్లు తెలిపారు.

Next Story