- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కొరకు అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోండి
దిశ, గద్వాల కలెక్టరేట్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS)ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల (2025–26 విద్యా

దిశ, గద్వాల కలెక్టరేట్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS)ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల (2025–26 విద్యా సంవత్సరం) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఓపెన్ స్కూల్ ద్వారా చదువును కొనసాగించే అవకాశం వదిలిపెట్టిన వారికి తిరిగి విద్యను పొందే మార్గం అందుబాటులో ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం 17 టాస్ సెంటర్లు (స్కూల్స్ మరియు కళాశాలలు) ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సెంటర్లలో విద్యార్థులకు సహాయ సూచనలు, పాఠ్యపుస్తకాలు మరియు పాఠ్య సహాయం అందించబడుతుంది. జిల్లాలో మొత్తం 1780 మంది విద్యార్థులకు అవకాశం కల్పించబడగా, నేటి తేదీ వరకు 1086 మంది మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించారు. ఆసక్తి గల వారు వయసు తో సంబంధం లేకుండా అక్టోబర్ 23వ తేదీ 2025 గురువారం లోపు తమ దరఖాస్తులను పూర్తి చేయాలని, ఆలస్యం చేయకుండా వెంటనే www.telanganaopenschool.org వెబ్‌సైట్ లో నమోదు చేసుకొని ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు.






