షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్ దగ్దం

by Malleboina Mahesh |

షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్‌కు దగ్ధమైన సంఘటన కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామంలోని నరసింహ రెడ్డి కి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌కు ఇంటి ముందు ఛార్జింగ్ పెట్టాడు.

షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్ దగ్దం
X

దిశ, కొత్తపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్‌కు దగ్ధమైన సంఘటన కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామంలోని నరసింహ రెడ్డి కి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌కు ఇంటి ముందు ఛార్జింగ్ పెట్టాడు. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన ఆయన మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపు కాలేదు. దీంతో మంటలలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఇటీవల ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు.

Next Story