ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌తీ ఇంటికి అందేలా కృషి : స‌ర్పంచ్ అన‌సూయ‌మ్మ

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-01 09:45:04  IST  )

దిశ‌, పాన్ గ‌ల్ : ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తి ఇంటికి అందేలా కృషి చేస్తామని స‌ర్పంచ్ బంగ్లా అన‌సూయ‌మ్మ‌, మాజీ జ‌డ్పీటీసీ ర‌వికుమార్ తెలిపారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌తీ ఇంటికి అందేలా కృషి :  స‌ర్పంచ్ అన‌సూయ‌మ్మ
X

దిశ‌, పాన్ గ‌ల్ : ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తి ఇంటికి అందేలా కృషి చేస్తామని స‌ర్పంచ్ బంగ్లా అన‌సూయ‌మ్మ‌, మాజీ జ‌డ్పీటీసీ ర‌వికుమార్ తెలిపారు. మండ‌ల ప‌రిధిలోని వెంక‌లాయిప‌ల్లి మ‌హిళ‌ల‌కు వారు ఇందిర‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌ర్పంచ్ అన‌సూయ‌మ్మ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రధానంగా పారిశుధ్యం తో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్, ఏపీఎం వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, సుజీవన్ శాంతి పాల్గొన్నారు.

Next Story