- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిష్టను మనోభావాలను దెబ్బ తీస్తున్న విద్యా కమిషన్ : పీఆర్టీయూ
తెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రి కి సమర్పించిన నివేదికలో కమిషన్ పరిధిలో లేని ఉపాధ్యాయుల జీతాల గురించి ప్రస్తావించడం విడ్డూరమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వై. జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : తెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రి కి సమర్పించిన నివేదికలో కమిషన్ పరిధిలో లేని ఉపాధ్యాయుల జీతాల గురించి ప్రస్తావించడం విడ్డూరమని, ఉపాధ్యాయులకు రెండు మూడు సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు రావడంలేదని ఉపాధ్యాయుల సమస్యలు ప్రస్తావించని కమిషన్ జీతాల గురించి ప్రస్తావించడం ఉపాధ్యాయుల ప్రతిష్టకు భంగం కలిగించడమేనని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు వై. జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. వెంకట్ రెడ్డి ఓ ప్రకటన లో అన్నారు. పేదవాళ్లను ప్రభుత్వ విద్యకు దూరం చేసే చాలా విషయాలు ఈ నివేదిక లో ఉన్నాయని సమగ్రమైన అధ్యయనం చేయకుండా మండలానికి రెండు మూడు స్కూళ్లు మాత్రమే ఉండాలని పేర్కొనడం శోచనీయమని అన్నారు.
ఉపాధ్యాయుల అర్హతల విషయంలో కూడా సాంకేతిక సంస్థలు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చిన సిఫారసులు చేవారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కుదించడం పేదవాళ్లకు ప్రభుత్వ విద్యను దూరం చేయడమేనని, వందల మంది విద్యార్థులను ఒకే చోట ఉంచడం వలన మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్ వినియోగంలో పారిశుద్ధ్య సమస్యలు, విద్యార్థులపై ఏకాగ్రత ఉంచడం మొదలగు సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి విద్యా కమిషన్ సిఫారసులను పునః సమీక్షించాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు.






