విధుల‌కు ప్ర‌ధానోపాధ్యాయుడు డుమ్మా.. డీఈవో త‌నిఖీలో వెలుగులోకి..!

by Ratna Kumari |

పాఠశాల విధులకు అనధికారికంగా గైర్హాజరవుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్ ప్రాథమిక పాఠశాల (ఎల్‌ఎఫ్‌ఎల్) ప్రధానోపాధ్యాయుడు శేఖర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని నాగర్‌కర్నూల్ మండల విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ ఆదేశించారు.

విధుల‌కు  ప్ర‌ధానోపాధ్యాయుడు డుమ్మా.. డీఈవో త‌నిఖీలో వెలుగులోకి..!
X

దిశ, కందనూల్ : పాఠశాల విధులకు అనధికారికంగా గైర్హాజరవుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్ ప్రాథమిక పాఠశాల (ఎల్‌ఎఫ్‌ఎల్) ప్రధానోపాధ్యాయుడు శేఖర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని నాగర్‌కర్నూల్ మండల విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌లోని సంజయ్‌నగర్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం నిర్వహించిన తనిఖీ సమయంలో కూడా ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడు శేఖర్ పాఠశాలకు గైర్హాజరైనందున మెమో జారీ చేసినట్లు తెలిపారు. అయితే బుధవారం నిర్వహించిన మరో ఆకస్మిక తనిఖీలోనూ ప్రధానోపాధ్యాయుడు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శేఖర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి, రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆ వివరణ ఆధారంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ భాస్కర్ రెడ్డిని ఆదేశించినట్లు తెలిపారు. పాఠశాలల విధి నిర్వహణలో అలసత్వం వహించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై శాఖపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఈవో ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ తనిఖీలో పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల ముఖ హాజరు వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలించారు.

Next Story