అధికారులు నిర్లక్ష్యం..వ‌ర్ష‌పు నీటితో పెను ముప్పు..!

by Ratna Kumari |

దిశ, నారాయణపేట క్రైమ్ : భాజాప్త పెద్ద నాలాను అక్రమార్కులు మొరం మట్టితో కప్పేశారు. అతిపెద్ద నాలా కనుమరుగు అయ్యేలా ఫ్లాట్ పనులు కొనసాగిస్తున్నారు.

అధికారులు నిర్లక్ష్యం..వ‌ర్ష‌పు నీటితో పెను ముప్పు..!
X

దిశ, నారాయణపేట క్రైమ్ : భాజాప్త పెద్ద నాలాను అక్రమార్కులు మొరం మట్టితో కప్పేశారు. అతిపెద్ద నాలా కనుమరుగు అయ్యేలా ఫ్లాట్ పనులు కొనసాగిస్తున్నారు. పైఎత్తు నుంచి వర్షపు నీరు వెళ్లడానికి కూడా వీలు లేకుండా నాలాను, నామరూపాలు లేకుండా చేసేలా నారాయణపేట జిల్లా కేంద్రంలో పలువురు అక్రమార్కులు నిర్మాణ పనులను చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రధాన నాలను ముసివేస్తూ పనులు కొనసాగుతున్నా ఆ వైపు అధికారులు కన్నెత్తి చూపకపోవడంతో అధికారులు పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ పనులు పాలకులు,అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా స్పందన లేకపోవడం పట్ల కబ్జాలు (మామూలు) అవుతున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ నాలా, పట్టణంలో అనేక గృహాలు,వరద నీటి ప్రవాహానికి ముఖ్యమైన మార్గంగా ఉంది. దీనిని మూసివేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిలిచే అవకాశం ఉంది. ఫలితంగా కింది భాగంలో ఉన్న ఇళ్లకు వరద ముప్పు పొంచి ఉంది.

ప్రభుత్వం చెప్పేది ఒకటి, జిల్లా కేంద్రంలో జరుగేది మరోటి!

రాష్ట్ర ప్రభుత్వం నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ, నాల్లో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్న తరుణంలో, జిల్లా కేంద్రంలోనే నాలను మూసివేస్తుండటం ఆశ్చర్యకరం అని ప్రజలు అంటున్నారు. నాలాలను రక్షించమని చెబుతున్న ప్రభుత్వం, జిల్లా కేంద్రంలో ముసివేస్తున్న అధికారులు చోద్యం చూస్తుండడం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కబ్జాకు గురవుతున్న నాలాను పునరుద్ధరించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. ప్రజా సౌకర్యాలను కాపాడడం ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ విభాగం బాధ్యత అని గుర్తుచేస్తూ, “నాలాలను కాపాడకపోతే నిరసనలు తప్పవు” అని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Next Story