- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వసతి గృహాలు పారా హుషార్.. కలెక్టర్ అకస్మిక తనిఖీలు..!
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలమూరు జిల్లా వసతి గృహాల నిర్వాహకులు పారా హుషార్ గా ఉండండి. విద్యార్థులకు వండే భోజనం, వంటి గది, స్టోర్ రూం, పరిసరాల శుభ్రత లలో తగు జాగ్రత్తలతో మెలగండి.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలమూరు జిల్లా వసతి గృహాల నిర్వాహకులు పారా హుషార్ గా ఉండండి. విద్యార్థులకు వండే భోజనం, వంట గది, స్టోర్ రూం, పరిసరాల శుభ్రత లలో తగు జాగ్రత్తలతో మెలగండి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అకస్మిక తనిఖీ లతో అన్నింటినీ పరిశీలించి అదరగొడుతున్నారు. మొన్నటికి మొన్న భూత్పూర్ జడ్పీ హైస్కూల్ లో భోజనం నాణ్యతను తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు, విద్యార్థులతో కలిసి భోజనం ఎందుకు చేయడంలేదని, వాహనాల పార్కింగ్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మధ్యనే దేవరకద్ర మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను తనిఖీ చేసి ఇవి నీళ్లలా? సాంబరా? అని తీవ్రస్థాయిలో నిలదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా వంటగదిలోకి ప్రవేశించి భోజనాన్ని రుచి చూశారు. స్టోర్ రూం ను తనిఖీ చేశారు. పరిసరాలు కలియ తిరిగి శుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం, ప్రవర్తనపై, భవిష్యత్ ప్రణాళికలు గురించి అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతలో రాజీ పడబోనని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్ధన్, వసతి గృహ సంక్షేమ అధికారి ఉన్నారు.






