- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీల సహనాన్ని పరీక్షించవద్దు : బీసీ జేఏసీ చైర్మన్ బెక్కెం జనార్ధన్
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బీసీ ల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగంలోని 9 షెడ్యూల్ లో చేర్చి అమలు చేయాలని ఉమ్మడి

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బీసీ ల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగంలోని 9 షెడ్యూల్ లో చేర్చి అమలు చేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ జెఏసి చైర్మెన్ బెక్కెం జనార్ధన్ డిమాండ్ చేశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ తో స్థానిక టిటిడి కళ్యాణ మంటపం వద్ద గురువారం 'ధర్మ దీక్ష' కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ ల రిజర్వేషన్ల తమ హక్కు అని, ఎవరి భిక్షం కాదని, రాజ్యాంగ పరంగా వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో తమ పోరాటం ఉగ్రరూపంలోకి తీసుకపోతామని హెచ్చరించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ లు మాట్లాడుతూ, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీ లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం పొంది కేంద్రానికి పంపితే ఆమోదించకుండా తొక్కిపెట్టారని వారు ఆరోపించారు. వెంటనే బీసీ ల రిజర్వేషన్ల అమలు ప్రక్రియ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కో చైర్మెన్ మున్నూరు రాజు, లక్ష్మణ్ గౌడ్, విజయ్ కుమార్, ప్రభాకర్, రాజేశ్వర్ గౌడ్, కొరమోని వెంకటయ్య, గంజి వెంకన్న, శివరాజ్ పాల్గొన్నారు.






