ఎంజాయ్ పేరుతో గంజాయి కి బానిస కావద్దు : ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ

by Ratna Kumari |

దిశ, చారకొండ : ఎంజాయ్ పేరుతో గంజాయికి బానిస కావద్దని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ అన్నారు. తెలంగాణ భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో తెలంగాణ ప్ర

ఎంజాయ్ పేరుతో గంజాయి కి బానిస కావద్దు : ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ
X

దిశ, చారకొండ : ఎంజాయ్ పేరుతో గంజాయికి బానిస కావద్దని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ అన్నారు. తెలంగాణ భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో తెలంగాణ ప్రజానాట్య మండలి బస్సు కళాజాత మంగళవారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలపై కళాజాత బృందం ప్రజలకు అవగాహన కల్పించారు. కళా ప్రదర్శన లో పల్లె నరసింహ మాట్లాడుతూ.. పట్టణం, గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఆరోగ్యాలను నాశనం చేసుకొని కన్న తల్లిదండ్రులకు కన్నీటిని మిగిలిస్తూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారనీ, యువత మత్తుకు బానిసలు కాకుండా ఉన్నతంగా చదువుకొని ఉన్నత శిఖరాలను అవరోధించాలని అన్నారు. అనంతరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా పల్లె నర్సింహను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బలరాం గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్, సీపీఐ మండల కార్యదర్శి ఏ సారపు అశోక్ గౌడ్, డాక్టర్ చిలువేరు,శ్రీను, సత్యం, భూత్పూర్ శంకరయ్య, JCB వెంకటయ్య గౌడ్, NSUI అధ్యక్షుడు గోరేటి శివ, లక్ష్మయ్య గౌడ్, గుండె శివ గౌడ్, చింతపల్లి అశోక్ గౌడ్, పసుల శీను, వెంకట్ రెడ్డి, గజ్జ కొండలు గౌడ్, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.

Next Story