- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళారుల చేతిలో పడి మోసపోవద్దు : మంత్రి జూపల్లి కృష్ణారావు
దిశ, పాన్ గల్ : రైతులు ఆరుకాలం కష్టించి పండించిన పంటను దళారుల చేతిలో పడి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

దిశ, పాన్ గల్ : రైతులు ఆరుకాలం కష్టించి పండించిన పంటను దళారుల చేతిలో పడి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకే కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధర పొందాలని కోరారు.
నిరుపేదలకు తీరిన సొంతింటి కల..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల తిరిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మంగళవారం మండల పరిధిలోని మాధవరావు పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు గృహప్రవేశం చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కళ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో తీరిందన్నారు. పాన్ గల్ నుండి శాఖాపూర్ మీదుగా కదిరపాడు వరకు రూ. మూడు కోట్ల ఐదు లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రోడ్డు నిర్మాణాన్ని నాణ్యవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీ వో గోవిందరావు మండల వ్యవసాయ అధికారి మణి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవికుమార్, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ ముంత భాస్కర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ హైమావతి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంగ దొడ్డి సురేఖ, రాము యాదవ్ పాల్గొన్నారు.






