- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధిని ఆగంచేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తావా...? : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
గత తొమ్మిదేళ్ల తమ పాలనలో వేల కోట్ల నిధులతో మహబూబ్ నగర్ పట్టణానికి చేసిన అభివృద్ధిని ఆగమాగం చేసి, పైగా నన్ను నాటకాలడుతున్నావని విమర్శిస్తావా అని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గత తొమ్మిదేళ్ల తమ పాలనలో వేల కోట్ల నిధులతో మహబూబ్ నగర్ పట్టణానికి చేసిన అభివృద్ధిని ఆగమాగం చేసి, పైగా నన్ను నాటకాలడుతున్నావని విమర్శిస్తావా అని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం భూత్పూర్ రోడ్డు లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ట్యాంక్ బండ్, సస్పెషన్ బ్రిడ్జి, శిల్పారామం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, ఐటీ పార్కు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చివరిదశలో ఉంటే వాటిని పూర్తి చేయకుండా పడావ్ చేశావని ఆయన ధ్వజమెత్తారు. అంతటి అభివృద్ధి కార్యక్రమాలు కళ్లముందే పాడై పోతుంటే చూసి కడుపుమండి కన్నీరు పెట్టుకుంటే రాజకీయ నాటకాలంటావా అని ఆయన దుయ్యబట్టారు. నీవు ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవని, నా నోరు విప్పితే నీ గుట్టు బయట పడుతుందని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేయడానికి మార్గం సుగమం చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 70 సార్లు డిల్లీకి పోతే నిన్ను ఎందుకు తీసుకపోలేదని ఆయన ప్రశ్నించారు. నిధుల పేరు మీద డిల్లీకి వెళ్లి అక్కడి బీజేపీ నాయకులను ఎందుకు కలుస్తున్నావో ఊహించలేని పిచ్చోళ్లుకాదు ప్రజలు అని, ఎన్నో పార్టీలు మారిన చరిత్ర నీదని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల కార్పోరేటర్ టికెట్ల విషయంలో పార్టీ జెండా మోసిన వారికి కాకుండా, నీ జోక్యంతోనే కేటాయించి, డిసీసీ అధ్యక్షుడిపై తోశావని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన విడియో ను ప్రదర్శించారు. తన హయాంలో 42 కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించానని, మిషన్ భగీరథ ద్వారా రోజు విడిచి రోజు మంచినీటిని అందించామని, ఐటి పార్క్, బైపాస్ రోడ్డు అప్పన్న పల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఇండోర్ స్టేడియం, ప్రభుత్వ వైద్య కళాశాల, కేసీఆర్ ఏకో పార్క్ లాంటి వాటిని ఎంతో గొప్పగా ఏర్పాటు చేశానన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ జిఓ కోసం రెండు ఏళ్లు కష్టపడి జిఓ ను తెచ్చి విడుదల చేశామని, ఎన్నికలు ముగిశాక పనులు మొదలుపెట్టాలని తలంపుతో ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ జిఓ ను కొద్దిగ మార్పు చేసి నేడు తాము నిర్మిస్తున్నామని నాటకాలాడుతున్నది నీవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాటకాలు ప్రజలు గమనించాలని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక కార్పోరేటర్లను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాజేశ్వర్ గౌడ్, గంజివెంకన్న, కే.సీ. నర్సింహులు పాల్గొన్నారు.






