'పాలమూరు' నుండి డిండి పేర సాగునీటిని తరలించొద్దు

by Ratna Kumari |

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుండి డిండి పేరు మీద సాగునీటిని తరలించే ఆలోచన విరమించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జెఎసి నాయకులు సోమవారం రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ను కలిసి విన్నవించారు.

పాలమూరు నుండి డిండి పేర సాగునీటిని తరలించొద్దు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుండి డిండి పేరు మీద సాగునీటిని తరలించే ఆలోచన విరమించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జెఎసి నాయకులు సోమవారం రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ను కలిసి విన్నవించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని మినిష్టర్ క్యాటర్స్ లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. సాగు నీటి తరలింపుకు ప్రత్యామ్నాయంగా నాగార్జున సాగర్ గొట్టిముక్కల లిఫ్ట్ ద్వారా ప్రతిపాదన ప్రాజెక్టు కు అవసరమైన నీటిని తీసుకోవాలని వారు ప్రతిపాదించిగా, అందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు జి.రాజేందర్ రెడ్డి, రాఘవాచారి, బెక్కెం జనార్ధన్, చెన్నకిష్టన్న, టిజి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Next Story