ట్రాఫిక్ నియంత్రణలో జిల్లా ఎస్పీ జానకి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దసరా సెలవులు ముగియడంతో జిల్లా పరిధిలోని నేషనల్ హైవే 44 పై ఉన్న బాలానగర్ దగ్గర విపరీతమైన

ట్రాఫిక్ నియంత్రణలో జిల్లా ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దసరా సెలవులు ముగియడంతో జిల్లా పరిధిలోని నేషనల్ హైవే 44 పై ఉన్న బాలానగర్ దగ్గర విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ జానకి ట్రాఫిక్ నియంత్రణకై బాలానగర్ చేరుకొని నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జీ పనులు జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆమె స్వయంగా పర్యవేక్షించారు. బాలానగర్ దగ్గర నిత్యం ట్రాఫిక్ జామ్ లు జరగడం అనవాయితీగా మారింది. ఆదివారం పండుగ సెలవులు ముగియడంతో వాహనాలు జామ్ కాకుండా ఎస్పీ జానకి ట్రాఫిక్ నియంత్రణ చేయడంతో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సజావుగా వాహనాలన్నీ సాగిపోయాయి. ఎస్పీ వెంట బాలానగర్ ఎస్ఐ లెనిన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story