బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలి

by velandi.Saikiran |

వనపర్తిలో బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభిను జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల

బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలి
X

దిశ, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభిను జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాదారి భోజరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాదారి భోజరాజు, జాతీయ మాలల ఐక్యవేదిక ఉపాధ్యక్షులు మద్దెల కరుణాకర్,కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి విజ్ఙ‌ప్తి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దినాభివృద్ధి చెందుతున్న వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలలైన రాజీవ్ చౌక్,అంబేద్కర్ చౌరస్తా, గాంధీచౌక్,రామాలయం,మర్రికుంఠ, పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్, భగీరథ చౌరస్తాలలో బస్సు షెల్టర్లు లను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రయాణికులు బస్సు షెల్టర్ లు లేక రోడ్డుపై,ఎండలో,వానలో నిలబడి ఇబ్బందులు ఎదుకొంటున్నారని వివరించారు.సమస్యను పరిష్కరించాలని కోరారు.

Next Story