జిల్లా పోలీస్ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దాలి : DIG L.S. చౌహాన్

by Ratna Kumari |

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : పోలీస్ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ సూచించారు.

జిల్లా పోలీస్ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దాలి : DIG L.S. చౌహాన్
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : పోలీస్ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ సూచించారు. బుధవారం ఆయన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించి మాట్లాడారు. ప్రజలతో అనుసంధానం మెరుగుపరచి, సకాలంలో స్పందించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్దతతో విధులు నిర్వర్తించాలని, రికార్డులు సక్రమంగా, నవీకరించడం అత్యవసరమన్నారు. జిల్లాలో నేరాల నివారణ, చట్ట వ్యవస్థను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్ లో మరింత క్రమశిక్షణతో ప్రజా సమస్యల పరిష్కారంలో అగ్రగాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి, అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్, డిఎస్పీ లు రమణారెడ్డి, శ్రీనివాసులు, ఏఓ రుక్మిణీ బాయి, ఆర్ఐలు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Next Story